ర‌ష్యా చేతిలో 4 ల‌క్షల ఉక్రెయిన్లు బందీ.. సాయం కోసం బైడెన్‌కు జెలెన్‌స్కీ ఫోన్

-

ఉక్రెయిన్ దేశంపై ర‌ష్యా యుద్ధం ప్ర‌క‌టించి ప‌ద‌కొండు రోజులు గ‌డుస్తుంది. భారీ క్షిప‌ణులు, బాంబుల‌తో ఉక్రెయిన్ పై ర‌ష్యా సైన్యం విరుచుక‌ప‌డుతుంది. అంతే కాకుండా ఉక్రెయిన్ల‌లోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల‌ను కూడా ఆక్ర‌మిస్తూ.. ర‌ష్యా సైన్యం ముందుకు వెళ్తుంది. ఉక్రెయిన్ ను ఆయుధ ర‌హితంగా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ర‌ష్యా యుద్ధాన్ని కొన‌సాగిస్తుంది. అలాగే ఉక్రెయిన్ సైనికుల‌ను, పౌరుల‌ను ర‌ష్యా సైనికులు బందీలు చేస్తోంది.

కాగ ఇప్ప‌టి వ‌ర‌కు 4 ల‌క్షల ఉక్రెయిన్ల‌ను ర‌ష్యా సైన్యం బందీంచింద‌ని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. కాగ ర‌ష్యాతో చేస్తున్న యుద్ధంలో త‌మ‌కు సాయం చేయాల‌ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ.. ప్ర‌పంచ దేశాల‌ను కోరుతున్నారు. అలాగే శ‌నివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు జెలెన్ స్కీ ఫోన్ చేసి మాట్లాడారు. ర‌ష్యాతో చేస్తున్న యుద్దంలో త‌మ‌కు సాయం చేయాల‌ని కోరారు.

ఉక్రెయిన్ కు ర‌క్షణ గా ఉండాల‌ని, అలాగే ప్రస్తుత ప‌రిస్థితుల దృష్ట్యా ఆర్థిక సాయం చేయాల‌ని అగ్ర రాజ్యాన్ని కోరారు. కాగ ఉక్రెయిన్ – ర‌ష్యా మ‌ధ్య యుద్ధం ప్రారంభం అయిన నాటి నుంచి బైడెన్ , జెలెన్ స్కీ ఫోన్ లో మాట్లాడుకోవ‌డం ఇది రెండో సారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version