దేశంలో ఆడపిల్ల బయట తిరగాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అత్యాచారాలు చేస్తున్నారు. రేప్ చేయడం, హత్య చేయడం అనేది ఇప్పుడు కామన్ గా మారిపోయిన వ్యవహారం. చట్టాల్లో ఉన్న లొసుగుల కారణంగా స్వేచ్చగా తిరుగుతున్నారు. ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన చూస్తే కన్నీళ్లు రావడం ఖాయం… కామాంధుడి కామానికి బలైపోయిన నాలుగేళ్ల చిన్నారి ఎయిడ్స్ బారిన పడింది. రాజస్థాన్ లో జైపూర్ నగరంలో ఒక కామాంధుడు… నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత ఆ బాలికకు వైద్య పరిక్షలు చేయగా ఆమెకు హెచ్ఐవి సోకిందని వైద్యులు గుర్తించారు. అతని ద్వారా ఆ బాలికకు ఆ వ్యాధి సోకిందని విచారణలో తెలిసింది. దీనితో ఆ బాలికకు వైద్యులు మందులు ఇచ్చి పంపించారు. ఆ బాలిక బ్రతికి ఉన్నన్ని రోజులు మందులు వాడాలని… అయితే ఆమె ఆరోగ్యానికి వచ్చిన సమస్య ఏమీ లేదని.. రోజు స్కూల్ కి వెళ్ళొచ్చని పిల్లలతో ఆడుకోవచ్చని వైద్యులు తెలిపారు. అధికారులు తమకు వాగ్దానం చేసిన పరిహారంలో సగం మాత్రమే బాలిక తల్లి తండ్రులు వాపోయారు. తమ బిడ్డ భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
“నిందితుడిని అరెస్టు చేసినప్పుడు, అతను హెచ్ఐవి పాజిటివ్ అని మాకు తెలియదు. మేము ఇప్పుడు జైలు అధికారులతో కలిసి విచారణ చేసామని మరియు అతను హెచ్ఐవి పాజిటివ్ మరియు చికిత్స పొందుతున్నాడని నిర్ధారించామని ఒక అధికారి తెలిపారు. మరో అధికారి మాట్లాడుతూ… పాజిటివ్ గా తేలిన మైనర్ అమ్మాయి విషయంలో, వైద్యులు మాకు సమాచారం ఇవ్వలేదన్నారు. నిందితుడు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నాడు, కాని అతను హెచ్ఐవి పాజిటివ్ అని ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం నిందితుడు జైల్లో ఉన్నాడు. ఈ ఘటనపై ఇప్పుడు రాజస్థాన్ లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.