బంపర్ ఆఫర్ : టీసీఎస్‌లో 40వేల ఉద్యోగాలు..!

-

నిరుద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ గుడ్‌న్యూస్ చెప్పింది. భారతదేశంలో 40వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ నియామకాలు క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉంటాయని పేర్కొంది. కరోనా వలన గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం తగ్గినప్పటికీ తమ సంస్థ‌ మాత్రం నియామకాలను తగ్గించుకోదని టీసీఎస్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు. అమెరికాలో కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ పెంచాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ టిసిఎస్ కంపెనీ గత సంవత్సరం  కూడా  మన  భారత క్యాంపస్‌ల నుంచి 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో 2,000 మందిని నియమించుకోవాలని నిర్ణయించింది. దీని వలన హెచ్1బీ, ఎల్ 1 వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని అభిప్రాయపడుతోంది. ఇంజనీర్లను మాత్రమే కాకుండా అమెరికాలో టాప్ 1 బి-స్కూల్స్ నుంచి గ్రాడ్యుయేట్లను కూడా నియమించుకోనున్నట్లు టీసీఎస్ వివరించింది. అయితే 2014 నుంచి టీసీఎస్ 20 వేల మందికి పైగా అమెరికన్లను నియమించుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version