సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌ లో 405 ఉద్యోగాలకు నోటిఫికేషన్

-

నిరుద్యోగులకు శుభవార్త. సౌత్ ఈస్టర్న్ కోల్​ లిమిటెడ్(ఎస్​ఈసీఎల్​) 405 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మైనింగ్ సిర్దార్, టెక్నికల్ & సూపర్‌వైజరీ గ్రేడ్ ‘సి’ పోస్ట్ ఇతర పోస్టుల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల ద్వారా అధికారిక వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 2023 ఫిబ్రవరి 03

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2023 ఫిబ్రవరి 23

దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది: 2023 ఫిబ్రవరి 24

సంతకం చేసిన దరఖాస్తు ఫామ్ ప్రింటౌట్ తీసుకోవడానికి చివరితేది: 2023 మార్చి7

రాత పరీక్షకు తేదీలు త్వరలో ఆఫీషియల్ వెబ్​సైట్​లో ప్రకటిస్తారు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా

దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత ప్రింటౌట్ తీసుకోవాలి. సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి, ఫొటో అంటించి, సంతకం చేసిన దరఖాస్తును పోస్టులో పంపాలి. గవర్నమెంట్‌/ సెమీ గవర్నమెంట్‌/ పీఎస్‌యూల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను దరఖాస్తుకు జతచేయాలి.

జనరల్‌ మేనేజర్‌ (పీ/ఎంపీ), ఎస్‌ఈసీఎల్, సీపట్‌ రోడ్, బిలాస్‌పుర్‌ (సీజీ) – 495 006.

Read more RELATED
Recommended to you

Exit mobile version