ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో నేపాల్ ఎంపీ చంద్ర భండారి ఇంట విషాదం నెలకొంది. బుధవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడులో ఎంపీతో సహా ఆయన తల్లి తీవ్ర గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడటంతో ఎంపీ తల్లి కన్నుమూశారు. చంద్ర భండారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అసలేం జరిగిందంటే..బుధవారం అర్ధరాత్రి.. ఎంపీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఎంపీ శరీరం 25 శాతం కాలిపోగా.. ఆయన తల్లి శరీరం 80 శాతం కాలిపోయింది. వెంటనే ఎంపీతో సహా ఆయన తల్లిని చికిత్స నిమిత్తం కీర్తిపుర్ ఆస్పత్రికి తరలించారు. అయితే సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవటం వల్ల వారిని ప్రత్యేక హాస్పిటల్కు తరలించాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. ముంబయి ప్రత్యేక ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. ఈలోపలే ఎంపీ తల్లి చనిపోయారు.