రానురాను స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. రోజూ ఎన్నో చోట్ల డ్రగ్స్ సరఫరాను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోట్ల రూపాయల డ్రగ్స్ సీజ్ అవుతున్నాయి. అయితే.. న్యూయర్‌కు ఇంకా వారం రోజులు మాత్రమే ఉండటంతో పోలీసులు మాదకద్రవ్యాలపై ఫోకస్ పెంచారు. దీంతో కోట్లలో డ్రగ్స్‌ను సీజ్ చేస్తున్నారు. అయితే.. హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. రూ. 50 కోట్ల విలువైన 25 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. మెఫిడ్రిన్ తయారు చేసే 2 ల్యాబ్‌లను అధికారులు సీజ్ చేశారు. ఈ ల్యాబ్‌లను నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అదుపులోకి తీసుకున్నది. ఈ నెల 21న హైదరాబాద్‌లో డీఆర్ఐ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి.. ఈ ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. రూ. 60 లక్షలతో పారిపోతుండగా అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడుగురిలో కొందరిపై గతంలోనే డ్రగ్స్ తయారీ కేసులు ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. కొందరిపై హైదరాబాద్‌లో హత్య కేసులు, వడోదరలో దోపిడీ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.