సినిమా అవకాశం కల్పిస్తామని కోరిక తీర్చుకున్నారు.!

-

సినిమా రంగంలో అవకాశం కోసం వెళ్లే వారికి అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. అలాగే అవకాశం కోసం వచ్చే వారిని మోసం చేసే బ్యాచ్ కూడా కాచుకొని వుంటారు. ఇలా మోసపోయే వారిలో  ఎక్కువ మంది అమ్మాయిలే వుంటారు. వారి ఆశను అడ్డు పెట్టుకుని మగ మృగాలు వారిని లైంగికంగా వేదిస్తూ వుంటారు.

రీసెంట్ గా టీవీ ఛానెల్ లో ప్రకటన చూసిన ఒక అమ్మాయి సినిమా అవకాశం కోసం హైదరాబాద్ వచ్చి మోసపోయిన సంఘటన వెలుగు చూసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన అమ్మాయి కి సినిమా పేరుతో వలవేసి ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ తమ కోరిక తీర్చుకున్నారు అని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది

ఆమెను సినిమా చాన్స్ కోసం రమ్మని హైదరాబాద్ లోహోటల్ రూమ్ బుక్ చేసి మంచి కాస్ట్లీ భోజనం పెట్టించారట. రేపు మేకప్ టెస్ట్ వుందని రెడీగా వుండమని, అడ్రస్ ఇచ్చి అక్కడకు రమ్మని చెప్పి వెళ్ళిపోయారట.ఉదయాన్నే వారు చెప్పిన చోటుకు వెళ్లిన ఆమెకు జ్యూస్ లో మత్తు మందు ఇచ్చి ఇద్దరూ ఆమెను లైంగికంగా అనుభవించారట. ఈ విషయం ఆమె తనకు తెలిసిన వారికి చెప్పినా కూడా వారు వాళ్ళను కూడా మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి సెటిల్ మెంట్ చేసి విషయాన్ని గప్ చుప్ గా ఉంచారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version