. గ్యాంగ్‌స్టర్ నయీం ఫ్యామిలీ మెంబర్స్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయండి : ఈడీ

-

గ్యాంగ్ స్టర్ నయీం ఫ్యామిలీ మెంబర్స్ మీద నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయాలని కోర్టును ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కోరారు. గతంలో అమాయకులను బెదిరించి అక్రమంగా లాక్కున్న భూములను తన కుటుంబ సభ్యుల పేర్ల మీద నయీం రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

ఎన్ని సార్లు సమన్లు ఇచ్చినా నయీం కుటుంబ సభ్యులు స్పందించడం లేదని ఈడీ అధికారులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో నయీం కుటుంబసభ్యుల పై NBW జారీ చేయాలని స్పెషల్ కోర్టను ఈడీ అధికారులు కోరారు. ఇప్పటికే నయీంకు సంబంధించి 35 అక్రమ ఆస్తుల జప్తునకు ఈడీ చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news