ఫ్యాక్ట్‌చెక్‌: రైల్వేల్లో 5వేల ఉద్యోగాల నోటిఫికేష‌న్ నిజ‌మేనా ?

-

భార‌తీయ రైల్వేల్లో 5వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని, వాటి భ‌ర్తీకి రైల్వేశాఖ నోటిఫికేష‌న్ ఇచ్చింద‌ని.. ఇటీవ‌ల ప‌లు వార్తా ప‌త్రిక‌లు, వెబ్‌సైట్ల‌లో వార్త‌లు వ‌చ్చిన విష‌యం విదిత‌మే. అయితే ఆ వార్తలు త‌ప్ప‌ని రైల్వే శాఖ ప్ర‌క‌టించింది. తాము అలాంటి ఏ నోటిఫికేష‌న్‌ను కూడా విడుద‌ల చేయ‌లేద‌ని, అదంతా ఫేక్ అని తేల్చి చెప్పింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టామ‌ని, త‌ప్పుడు స‌మాచారం ఇచ్చిన వారిని గుర్తించి వారిపై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రైల్వే శాఖ తెలిపింది.

కాగా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ప‌రీక్ష‌ల తేదీల కోసం అభ్య‌ర్థులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఓ ఏజెన్సీ రైల్వే శాఖ‌లో 5వేల ఖాళీలు ఉన్న‌ట్లుగా త‌ప్పుడు నోటిఫికేష‌న్ ఇచ్చింద‌ని గుర్తించారు. దాంతో రైల్వేకు ఎలాంటి సంబంధం లేద‌ని తేల్చారు. అందువ‌ల్ల ఆ వార్త ఫేక్ అని రైల్వే శాఖ తెలియ‌జేసింది. ఏదైనా ఏజెన్సీని తాము ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు నియ‌మించుకుంటే తాము ఉద్యోగాల నోటిఫికేష‌న్‌ను తెలియ‌జేస్తామ‌ని రైల్వేశాఖ తెలిపింది.

రైల్వే శాఖ సెంట్ర‌లైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేష‌న్ (సీఈఎన్‌) ద్వారా జాతీయ దిన‌ప‌త్రిక‌లు, స్థానిక వార్తా ప‌త్రిక‌ల్లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను ఇస్తుంద‌ని.. క‌నుక అలాంటి వార్తల‌ను ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని రైల్వే శాఖ తెలిపింది. కేవ‌లం సీఈఎన్ ద్వారా విడుద‌ల‌య్యే వార్త‌ల‌నే న‌మ్మాల‌ని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version