వరంగల్ వేదికగా సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి : హరీశ్ రావు

-

వరంగల్ వేదికగా సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపాలని ప్రభుత్వానికి సూచించారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్‌గా మోసం చేసిందన్నారు. అందుకే వరంగల్ వేదికగా అన్ని వర్గాలకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని కోరారు.పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి నెట్టారని ఆరోపించారు.‘ఎవరనుకున్నారు, ఇట్లవునని ఎవరనుకున్నారు’ ప్రజాకవి కాళోజీ చెప్పినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డారని ఆరోపించారు. రైతులు దారుణంగా మోసపోయారని, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్‌కు ఏడాదైనా అతీగతీ లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version