రూ.77వేలు త‌గ్గిన హార్లీ డేవిడ్‌స‌న్ ఎంట్రీ లెవ‌ల్ బైకుల ధ‌ర‌లు..!

-

ప్ర‌ముఖ టూ వీల‌ర్ త‌యారీ కంపెనీ హార్లీ డేవిడ్‌స‌న్ భార‌త్‌లో అమ్ముడ‌వుతున్న త‌మ కంపెనీకి చెందిన ప‌లు ఎంట్రీ లెవ‌ల్ బైక్‌ల ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గించింది. హార్లీ డేవిడ్‌స‌న్ స్ట్రీట్ 750 బీఎస్‌6 వేరియెంట్ ధ‌ర‌ను రూ.65వేలు త‌గ్గించింది. గ‌తంలో ఈ బైక్ ధ‌ర రూ.5.34 ల‌క్ష‌లు ఉండ‌గా.. ఇప్పుడు దీన్ని రూ.4.69 ల‌క్ష‌ల‌కు కొన‌వ‌చ్చు.

హార్లీ డేవిడ్‌స‌న్ స్ట్రీట్ 750 బైక్‌కు గాను టూ-టోన్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే మాత్రం రూ.4.81 ల‌క్ష‌లు చెల్లించాలి. అలాగే హార్లీ డేవిడ్‌స‌న్ స్ట్రీట్ రాడ్ బైక్ ధ‌ర రూ.77వేలు త‌గ్గింది. గ‌తంలో దీని ధ‌ర రూ.6.55 ల‌క్ష‌లు ఉండ‌గా.. ఇప్పుడు దీన్ని రూ.5.99 ల‌క్ష‌ల‌కు విక్ర‌యిస్తున్నారు. ఈ బైక్ టూ-టోన్ క‌ల‌ర్ వేరియెంట్ ధ‌ర రూ.6.67 ల‌క్ష‌లుగా ఉంది. ఢిల్లీ ఎక్స్ షోరూం ధ‌రల‌ ప్ర‌కారం ఆయా మోడ‌ల్స్ ధ‌ర‌లు అలా ఉన్నాయి.

కాగా ఈ రెండు బైక్‌లు భార‌త్‌లో ఇప్పటికే అధిక సంఖ్య‌లో అమ్ముడ‌య్యాయి. ఎంట్రీ లెవ‌ల్ బైక్‌లు కావ‌డంతో అనేక మంది వీటిని కొనేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే వీటి ధ‌ర‌లు ప్ర‌స్తుతం భారీగా త‌గ్గ‌డంతో సేల్స్ మ‌రింత పెరుగుతాయ‌ని ఆ కంపెనీ భావిస్తోంది. ఇక స్ట్రీట్ 750 మోడ‌ల్ బైక్‌లో 749 సిసి లిక్విడ్ కూల్డ్‌ ఇంజిన్ ఉంటుంది. దీనికి 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇస్తున్నారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ షాక్స్ ఉంటాయి. డ్యుయ‌ల్ చాన‌ల్ ఏబీఎస్ క‌లిగిన డిస్క్ బ్రేకుల‌ను ఇందులో అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version