మగవాళ్ళు ఒక అమ్మాయిని అమితంగా ఇష్టపడినపుడు చేసే పిచ్చి పనులు..

-

అబ్బాయి నచ్చినా కూడా ఆ విషయాన్ని బయటకు తెలియనివ్వకుండా మెయింటైన్ చేసే శక్తి అమ్మయిలకు ఉంటుందేమో కానీ.. ఒకమ్మాయి నచ్చిన తర్వాత దాన్ని బయటకు చెప్పకుండా అబ్బాయిలు మాత్రం ఉండలేరు.

డైరెక్టుగా మాటల ద్వారా తన ఇష్టాన్ని చెప్పకపోయినా.. తన చేష్టల ద్వారా ఆ ఇష్టాన్ని తనకు తెలియకుండానే తెలియజేస్తుంటాడు అబ్బాయి. ఆ చేష్టల్లో కొన్ని పిచ్చి చేష్టలు కూడా ఉంటాయి. ఆ చేష్టలు ఎలా ఉంటాయో చూద్దాం.

మిస్టర్ ఫర్ఫెక్ట్ లా నటించడం:

నచ్చిన అమ్మాయి ముందు.. మిస్టర్ పర్ఫెక్ట్ లా నటిస్తుంటాడు అబ్బాయి. చాలాసార్లు అది నటన అని తెలిసిపోతుంటుంది. ఎందుకంటే.. తన టైప్ కాకపోయినా.. ఎవరో వేరేవాళ్ళలా బిహేవ్ చేయడం ఈజీగా కనిపిస్తుంది.

అతి పొగడ్తలు:

పొగడ్త మామూలుగా ఉంటే బాగానే ఉంటుంది. ఓవర్ డోస్ అయితే చుట్టుపక్కలున్న వారికి అదోలా ఉంటుంది. నచ్చిన అమ్మాయిని ఓవర్ గా పొగడటంలో అబ్బాయి ఎప్పుడూ ముందుంటాడు. ఆ పొగడ్త ఆమెని ఇబ్బంది పెట్టినా సరే అతను పట్టించుకోడు.

సోషల్ మీడియా చెకింగ్:

అమ్మాయి మీద ఇష్టం ఎక్కువైతే.. ఆ అమ్మాయి సోషల్ మీడియా అకౌంట్ మీద కన్నేసి ఉంచుతారు. వాళ్ళ ఫాలోవర్లని గమనిస్తూ ఉంటారు.

ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు:

వసపిట్టలా ఎప్పుడూ ఏదో ఒకటి నచ్చిన అమ్మాయితో మాట్లాడుతూనే ఉంటారు. ఒకవేళ ఆ అమ్మాయి.. బోర్ గా ఫీల్ అయితే మాటలు తగ్గించి లోపల లోపలే ఫీల్ అవుతారు. అనవసరంగా బోర్ తెప్పించానే అని తనను తాను తిట్టుకుంటాడు. అంతేకాదు, ఆ అమ్మాయికి ఎప్పుడెప్పుడు హెల్ప్ చేద్దామా అని ఎదురు చూస్తూనే ఉంటాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version