ఫాస్ట్ బౌలర్ బుమ్రా భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడానికి మరో ఆరు నెలల సమయం పట్టనుంది. వెన్నుగాయం నుంచి ఇంకా కోల్పోకపోవడంతో సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకవేళ అతడు సర్జరీ చేయించుకుంటే ఆరు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు.
దీంతో త్వరగా జరగబోయే ఐపీఎల్, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కు దూరం కానున్నాడు. వెన్నుగాయం బుమ్రా కెరియర్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ప్రీమియర్ లీగ్ ‘ఐపీఎల్’. ఈ ఐపీఎల్ లీగ్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2023 సీజన్ కు దూరం కానున్నట్లు ప్రచారం జరుగుతుంది.