ర్యాగింగ్ విషయంలో రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు తెలిపారు. తాజాగా హైదరాబాదులో మెడికో ఆత్మహ్యత ఘటన నేపథ్యంలో మంత్రి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంగళగిరిలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వినోద్ కుమార్ గారు, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వీసీ బాబ్జి గారు, రిజిస్ట్రార్ రాధికారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని గారు మాట్లాడుతూ ర్యాగింగ్ భూతం విషయంలో అన్ని మెడికల్ కళాశాలలు కఠినంగా ఉండాలని స్పష్టంచేశారు. మెడికోలపై ఎక్కడా, ఎలాంటి వేధింపులు ఉండటానికి వీల్లేదన్నారు. ర్యాగింగ్ సమస్య పరిష్కారానికి ఆయా కళాశాలలు తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా మంత్రి గారు వివరించారు.