గ్యాస్ సిలెండర్లు మొదలు జీఎస్టీ వరకు నేటి నుండి మారనున్న 6 అంశాలు ఇవే..!

-

ప్రతీ నెలా కూడా ఏదో ఒక మార్పు వస్తుంది. అలానే మే నెల లో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. మారిన అంశాలు చూసి వాటికి తగ్గట్టుగా నడుచుకోవాలి. ఏయే అంశాలు మారాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక మరి వాటి కోసం చూసేద్దాం.

జీఎస్‌టీ (GST):

మే 1 నుంచి కొత్త రూల్ అమలులోకి రానుంది. కొత్త రూల్ ప్రకారం రూ.100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు లావాదేవీల రసీదులను ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో ఏడు రోజుల్లో అప్లోడ్ చెయ్యాల్సి వుంది. ఇప్పటి వరకు ఈ రూల్ లేదు కానీ నేటి నుండి తప్పక పాటించాల్సి వుంది.

గ్యాస్ సిలిండర్ ధరలు:

19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 171.50 మేర తగ్గింది. ఈ విషయాన్ని ప్రకటించాయి. ఈ కొత్త ధరలు మే ఒకటి నుండి అమలులోకి రానున్నాయి. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1856.50కి తగ్గింది. ముంబైలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,808.50 గా వుంది. కోల్‌కతాలో అయితే రూ. 1,960.50, చెన్నైలో రూ.2,021.50గా ఉంది. మార్చి‌లో రూ.350 మేరకు కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచారు. ఏప్రిల్‌లో రూ. 91.50 చొప్పున తగ్గించాయి. ఈసారి ఇప్పుడు మే లో మరోసారి రూ. 171.50 మేర కమర్షియల్ సిలిండర్లపై ధరను తగ్గించాయి ఆయిల్ కంపెనీలు.

(కేవైసీ (KYC):

మే 1 నుంచి కొత్త రూల్ అమలులోకి రాబోతోంది. కేవైసీ పూర్తి చేసిన ఇ-వాలెట్ల నుంచి మాత్రమే పెట్టుబడుల నగదును తీసుకోవాలని మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలకు మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ తెలిపింది. ఈరోజు నుంచి కేవైసీ పూర్తి చేయకపోతే వాలెట్ల నుంచి డబ్బులను పంపడానికి కుదరదు.

ఏటీఎం ఛార్జీలు:

డబ్బులు లేకుండా ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే రూ.10 ప్లస్ జీఎస్‌టీ కట్టాల్సి వుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు ఏటీఎం లావాదేవీల విషయంలో కొత్త నియమాలు తీసుకు వచ్చింది.

ట్రాయ్ రూల్స్ (TRAI):

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కూడ మే 1 నుంచి కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ఫేక్, ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్‌ల కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ ఫిల్టర్‌ను సెటప్ చేయనుంది.

ఈపీఎఫ్ఓ :

ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకునేందుకు మే 3 వరకు గడువును పెంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version