తాడేపల్లిలో మిస్టరీగా మారిన బాలుడి కిడ్నాప్, హత్య ?

-

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మెల్లెంపూడిలో నిన్న కిడ్నాప్ అయ్యాడని ప్రచారం జరిగిన బాలుడి కథ విషాదాంతమైంది. మొన్న అదృశ్యమైన బాలుడు భార్గవ తేజ(6) నిన్న సాయంత్రం తమ ఇంటి సమీపంలోనే ఉన్న పొలాల్లో విగతజీవిగా కనిపించాడు. బాలుడి తండ్రి భగవానియా నాయక్‌ ఓ ప్రైవేటు యూనివర్సిటీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు కాగా రెండో కుమారుడు భార్గవ తేజ మొన్న సాయంత్రం అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాప్, మిస్సింగ్ కోణంలో విచారణ చేశారు. అయితే తమ ఇంటికి సమీపంలోని పొలాల్లో  భార్గవ తేజ విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించిన తల్లితండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడి శరీరంపై గాయాలు ఉండడంతో ఎవరైనా హత్య చేశారా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీస్ క్లూస్ టీమ్, జాగిలాలు సైతం ఏమీ కనిపెట్టలేక పోయాయి. ఇక మరో బాలుడు కూడా తాడేపల్లి లో మిస్సయ్యాడు. ఆ బాలుడి ఆచూకీ మాత్రం దొరకలేదు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version