మార్చి 16 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

 

మార్చి 16 – పాల్గుణమాసం – మంగళవారం.

మేషరాశి:ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అవుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.  వ్యాపారాల్లో లాభాలు వస్తాయి.
పరిహారాలుః ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

todays horoscope

వృషభ రాశి:ధననష్టం జరుగుతుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. రుణ బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం జరుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల  పోయే అవకాశం ఉంది. పిల్లల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
పరిహారాలుః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని బీదవారికి అన్నదానం చేయండి.

మిధునరాశి:ఈరోజు సంతోషకరంగా ఉంటుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దంపతులిద్దరూ ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాల ప్రారంభం అనుకూలిస్తుంది. లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో పదోన్నతులు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తారు.
పరిహారాలుః ఈరోజు అన్నపూర్ణ దేవిని ఆరాధించండి.

కర్కాటకరాశి:ఈరోజు అనుకూలంగా లేదు !

ఈరోజు అనుకూలంగా లేదు. అనుకున్న పనులు సమయానికి పూర్తికావు. వాయిదా పడతాయి, దీనివల్ల మీరు నష్టపోతారు. సమయానికి చేతికి డబ్బులు అందవు. రుణ బాధలు పెరిగిపోతాయి. ధననష్టం జరుగుతుంది. తల్లిదండ్రుల నీ గౌరవించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ద కోల్పోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు.
పరిహారాలుః ఈరోజు దుర్గా దేవిని ఆరాధించండి.

సింహరాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. సోదరులతో విభేదాలు ఏర్పడతాయి. విద్యార్థులు విద్య మీదనే శ్రద్ధ వహించడం మంచిది. క్రొత్త వ్యక్తులతో పరిచయాలు అనర్ధాలు కలిగిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
పరిహారాలుః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయండి.

కన్యారాశి:ఉద్యోగ అవకాశాలు వస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో అందరితో ఆనందంగా సఖ్యతగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. సోదరులతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. అనారోగ్యాలకు దూరంగా ఉంటారు.  మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. గృహంలో శుభకార్యాన్ని తలపెడతారు. వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు.
పరిహారాలుః ఈరోజు శ్రీకనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

తులారాశి:బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. ధనయోగం కలుగుతుంది. ఆరోగ్యాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి:వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి ఏర్పడుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగం వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. గతంలో ఉన్న అనారోగ్యాలు తగ్గిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు.

పరిహారాలుః  ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

ధనస్సురాశి:తొందరపాటుతనం వల్ల నష్టపోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న కోపం వల్ల తొందరపాటుతనం వల్ల నష్టపోతారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేరు. ఆటంకాలు ఎదురైనా వాయిదా పడతాయి. ఇబ్బందులు కలుగుతాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు వహించడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయాలపై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువును అశ్రద్ధ చేస్తారు. పెద్దవారి మాట వినడం వల్ల బాగుంటుంది.
పరిహారాలుః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

మకరరాశి:తక్కువ మాట్లాడడం మంచిది !

ఈరోజు సంతోషకరంగా ఉండదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. మీలో ఉన్న చికాకుల వల్ల మొండితనం వల్ల నష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. తక్కువ మాట్లాడడం మంచిది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది.
పరిహారాలుః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

కుంభరాశి:వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా సఖ్యతగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. లాభాలు కలుగుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. అవసరానికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. అనారోగ్యానికి దూరంగా ఉంటారు. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు.
పరిహారాలుః ఈరోజు శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

మీనరాశి:ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. తల్లిదండ్రుల మాటలను పెద్ద వారి మాటలను పాటించడం మంచిది. విద్యార్థులు చదువు విషయంలో ఆ శ్రద్ధ చూపుతారు. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో వ్యతిరేకతలు ఏర్పడతాయి. ప్రయాణాలు అనుకూలించవు. నూతన వ్యాపారాలు అనుకూలించవు. స్వల్ప నష్టాలు కలుగుతాయి.

పరిహారాలుః  ఈరోజు శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version