నేడే 67 వ జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల ప్రదానోత్సవం : ముఖ్య అతిధిగా వెంకయ్య నాయుడు

ఢిల్లీ : నేడే 67 వ జాతీయ సినిమా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఈ ఏడాది మార్చి లో ప్రకటించిన జాతీయ సినిమా పురస్కారాలను నేడు ప్రధానం చేయనుంది. “కోవిడ్” మహమ్మారి కారణంగా పురస్కారాల ప్రదానం లో జాప్యం, మరియు వాయుదా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో వాయిదా ఈ కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది.

ఇక ఈ రోజు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి దేశ ఉప రాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కాగా… ఈ ఏడాది రజనీ కాంత్ కు 51 వ “దాదాసాహెబ్ ఫాల్కే” పురస్కారం లభించిన సంగతి తెలిసిందే.  అలాగే… మనోజ్ వాజ్ పేయ్, కంగనా రనౌత్, ధనుష్ లకు ఉత్తమ నటుల పురస్కారాలు దక్కాయి. 2019 లో మహేష్ బాబు హీరో గా నటించిన “మహర్షి” సినిమా “ఉత్తమ వినోదాత్మక చిత్రం” ( హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్) గా ఎంపిక కాగా….ఆ అవార్డు ను చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి అందుకున్నారు.