తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా విజృంభిస్తుంది. ప్రతి రోజూ తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62 కు చేరింది.
అయితే.. తాజాగా నమోదు అయిన 7 ఒమిక్రాన్ కేసులు..విదేశాల నుంచి వచ్చిన వారివేనని వైద్య అధికారులు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనూ… తెలంగాణ రాష్ట్ర మందుబాబులకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది.
డిసెంబర్ 31 న అర్థరాత్రి వరకు వైన్స్ ఒపెన్ ఉండేలా ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మద్యం షాపులతో సహ, ఈవెంట్లు, బా ర్లు, రెస్టారెంట్ల కు డిసెంబర్ 31 న అర్థరాత్రి వరకు ఓపెన్ చేసుకునేలా అనుమతులు ఇస్తూ.. కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నూతన సంవత్సరం ఉత్తర్వులను జారీ చేసింది కేసీఆర్ సర్కార్.