చేతి వేళ్ళని విరిస్తే చప్పుడు ఎందుకు వస్తుందో తెలుసా..?

-

మామూలుగా మనం చేతి వేళ్ళని విరిస్తున్నప్పుడు చప్పుడు వస్తుంది. అయితే ఎందుకు చేతి వేళ్లను విరిచినప్పుడు చప్పుడు వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా..? అయితే ఇక్కడ దానికి సమాధానం ఉంది. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేయండి. ఎప్పుడైనా మనం చేతి వేళ్ళను విరిస్తే టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. అయితే మన శరీరంలో ఎముకల మధ్య గ్యాస్ ఫామ్ అవుతుంది.

ఆ గ్యాస్ ఒక బుడగ మాదిరి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం వేళ్ళని విరుస్తామొ అప్పుడు బుడగ ఫామ్ అవుతుంది. దీనితో సౌండ్ వస్తుంది. అయితే ఒకసారి మనం వేళ్ళని విరిచాక మళ్లీ ఆ గ్యాస్ తయారవడానికి కాస్త సమయం పడుతుంది. గ్యాస్ మళ్లీ ఫామ్ అయిన తర్వాత గ్యాస్ తిరిగి బుడగలాగా ఏర్పడుతుంది.

మళ్లీ మనం వేళ్ళని విరిచినప్పుడు మళ్ళీ సౌండ్ వస్తుంది అయితే అసలు ఈ గ్యాప్ ఎలా వస్తుంది అనేది చూస్తే.. శరీరంలో రెండు ఎముకల మధ్య సినోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇది లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది చేతులు మనం ముడిచిన ఈ ఫ్లూయిడ్ అనేది నైట్రోజన్ గ్యాస్ గా మారుతుంది.

ఆ గ్యాస్ బుడగలు లాగ తయారవుతుంది దీని కారణంగానే మనం ఎప్పుడైనా చేతులని విరిస్తే సౌండ్ వస్తుంది. అలానే వేళ్ళని విరిచిన తర్వాత వెంటనే విరిస్తే సౌండ్ రాదు ఎందుకంటే తిరిగి మళ్లీ బుడగ లాగ మారడానికి సమయం పడుతుంది కనుక.

Read more RELATED
Recommended to you

Exit mobile version