నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ పై కేటీఆర్ ఆసక్తికర ట్విట్..బీజేపీ పాలిత రాష్ట్రాలే అట్టడుగు ఉన్నాయంటూ…

-

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్విట్ చేశాడు. నిన్న విడుదలైన నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయంటూ… విమర్శించారు. ఆయన ట్విట్ లో ’’నీతి అయోగ్ ఆరోగ్య సూచికలో దిగువన ఉన్న మూడు రాష్ట్రాలు ఏవో ఊహించండి? నిజం బయటకు వచ్చినప్పుడు..Up+Yogi = UpYogi అనే వాదనలు తొలిగిపోతాయని..యూపీ అధ్వాన్నంగా ఉందని. బీమారు ( బీహార్) వారి పాలనకు సరైన పేరుగా ఉందని చమత్కరించారు. దశాబ్ధాలుగా ఈ రాష్ట్రాలను బీజేపే పాలిస్తుందని గుర్తు చేశారు.‘‘

ఇటీవల విడుదలైన నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానాన్ని సాధించింది. గతంలో నాలుగో స్థానంలో ఉండగా.. ఓ స్థానం ఎగబాకి మూడుకు చేరింది. ఈ జాబితాలో కేరళ తొలిస్థానంలో నిలువగా.. తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు చివరి స్థానాల్లో నిలిచాయి. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును, బీజేపీ ప్రభుత్వాల పనితీరును పోల్చేందుకు కేటీఆర్ ఈ ట్విట్ చేశారని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version