ఇదిగో రెడీగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్..! ఎన్ని వేల పోస్టులో..

-

కరోనా నేపథ్యంలో ప్రపంచం తలకిందులు అయిపోయిన దశలో చాలామందికి జీవనాధారం కోల్పోయారు. ఇక ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకున్నవారు…. అందులోనూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కోసం ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న వారికి బంగారం లాంటి అవకాశం వచ్చింది. భారతదేశంలోనే అతిపెద్ద స్టేట్ ట్రాన్స్పోర్ట్ యూనిట్ అయినటువంటి ఆర్ఆర్బీ ఎన్టిపిసి రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలైపోయింది. 2020 సంవత్సరానికి గాను ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆన్లైన్ ఎగ్జామ్ జరిపేందుకు సిద్ధమైంది. ఎగ్జామ్ ద్వారా 35,208 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఇవన్నీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరి పోస్టులు కావడం విశేషం. వీరందరూ రైల్వే ఉద్యోగులుగా పరిగణింపబడతారు.

ఈ ఖాళీగా ఉన్న పోస్టుల అన్నింట్లో 24,605 పోస్టు గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు…. అనగా కనీసం డిగ్రీ అర్హత ఉండవలసి ఉండగా మిగిలిన 10,603 ఖాళీ పోస్టుల అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది…. అనగా టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నాకూడా చాలు. త్వరలోనే ఈ ఎగ్జామ్ నిర్వహించేందుకు సంబంధించిన ఏజెన్సీని టెండర్ ద్వారా ఎంపిక చేసిన తర్వాత ఆర్ఆర్బీ ఎన్టిపిసి 2020 పరీక్షా తేదీని ప్రకటిస్తారు. ఈ జీతం తో పాటు మరికొన్ని సౌలభ్యాలు కూడా ఉన్నాయి. డిఎ, హెచ్ఆర్ఎ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, పెన్షన్ స్కీమ్, మెడికల్ సౌకర్యాలు, ఇక స్పెషల్ అలవెన్స్ లు కూడా ఉన్నాయి.

పోస్టులు : క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, టైం కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్ వంటి వేర్వేరు విభాగాల్లో ఎగ్జామ్ ద్వారా ఇండియన్ రైల్వేస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాల్లో మన అనుభవాన్ని బట్టి భారీగా జీతాలు ద్వారా పెరిగే అవకాశం ఉంది.

విద్యార్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా దానికి సమానమైన డిగ్రీ
వయసు పరిమితి : జనరల్ కేటగిరి వారికి 18-33 సంవత్సరాలు, ఓబిసి వారికి 18-36 ఎస్సీ,ఎస్టీ వారికి 18-38 సంవత్సరాలు.

Read more RELATED
Recommended to you

Latest news