`వకీల్‌సాబ్` మోషన్ పోస్టర్‌.. పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్‌సాబ్ అప్డేట్ వచ్చేసింది. పవన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే గిస్ట్ ఫ్యాన్స్ ముందుకి రానుందని… బుధవారం ఉదయం 9.09 గంటలకు `వకీల్‌సాబ్` మోషన్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే వకీల్‌సాబ్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. హిందీలో విజయవంతమైన `పింక్` తెలుగు రీమేక్‌ `వకీల్‌సాబ్` సినిమాతో పవన్ కళ్యాణ్ వెండితెర పైకి మరోసారి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అలాగే ఐ సినిమాలో పవన్ సరసన అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి థమన్ స్వరాలు అంధిస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా నుంచి ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యాయి. వాటికి మంచి ఆదరనే లభించింది. అలాగే ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్‌ కూడా సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సత్యమేవ జయతే అంటూ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్, పవన్ కళ్యాణ్ పోజుతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news