Kedarnath Yatra will be temporarily suspended: కేదార్‌నాథ్ యాత్రికులకు బిగ్ షాక్. కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. కేదార్ నాథ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 18 మంది గల్లంతు అయ్యాయి. కేదార్‌నాథ్‌లో 16 వందల మంది యాత్రికులు చిక్కుకున్నారు.
భారీ వర్షాలకు కొండ చరియలు..విరిగిప డుతున్నాయి. ఈ తరునంలోనే.. కేదార్ నాథ్ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడి 18 మంది గల్లంతు అయ్యాయి. అటు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ బృందాలు..రంగంలోకి దిగాయి.
ఇక అటు గౌరీకుండ్-కేదార్‌నాథ్ దారి లో చిక్కుకుపోయారు భక్తులు.. ఇప్పటి వరకు 3 వేల మందిని రక్షించింది రెస్క్యూ టీమ్స్. గల్లంతైన వారికోసం హెలికాప్టర్లు, డోన్లతో గాలిస్తున్నాయి సహాయక బృందాలు.. హరిద్వార్, తెహ్రీ, డెహ్రాడూన్, చమోలీ జిల్లాల్లో ఆకస్మిక వరదలు చోటు చేసుకున్నాయి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.