తెలంగాణ‌లో నేడు కొత్త‌గా 82 కరోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి పూర్తిగా త‌గ్గుముఖం ప‌డుతుంది. గ‌త రెండు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో వంద లోపే క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. కాగ నేటి తెలంగాణ రాష్ట్ర క‌రోనా బులిటిన్ కాసేప‌టి క్రితం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 82 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో న‌మోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య‌.. 7,89,758 కి చేరింది. కాగ రాష్ట్రంలో నేడు కూడా క‌రోనా మ‌ర‌ణాలు వెలుగు చూడ‌లేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 311 మంది బాధితులు క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రం కేవ‌లం 1,710 క‌రోనా కేసులు మాత్ర‌మే యాక్టివ్ గా ఉన్నాయి. అలాగే నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగాఈ 17,022 క‌రోనా నిర్ధ‌రాణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version