తెలంగాణలో త్వరలోనే మరో 9,200 ఉద్యోగాల భర్తీ..

-

తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ 91 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. అయితే ఇప్పటివరకు దాదాపుగా 35వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అయితే.. త్వరలోనే మరో 9,200 గ్రూప్‌-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. ఏడాదిలోపే ఈ ఉద్యోగాలన్నీ భర్తీచేస్తామని స్పష్టం చేశారు మంత్రి హరీష్‌ రావు.

అంతేకాకుండా.. ఇక నుంచి ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ను రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్టు వెల్లడించారు మంత్రి హరీష్‌ రావు.  పోలీస్‌ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అన్ని ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌ ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగార్థులు చిత్తశుద్ధితో చదివి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. కొన్నిరోజులు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండి, తాత్కాలిక ఆనందాలు పక్కకుబెట్టి దీర్ఘకాలిక లక్ష్యం కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version