హైదరాబాద్ లో 9999 క్రేజ్ చూసారా…?

-

వాహన రిజిస్ట్రేషన్ నెంబర్లలో 9999కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫ్యాన్సీ నెంబర్ లు ఎన్ని ఉన్నా సరే దీనికి సిని రాజకీయ పెద్దలు కూడా ఎక్కువగా పోటీ పడుతూ ఉంటారు. తాజాగా టీఎస్13ఈపీ కొత్త సిరీస్‌ రావడంతో ఆల్‌ 9999 కోసం తీవ్ర పోటీ నెలకొంది. పశ్చిమ మండలం ఆర్టీఏ కార్యాలయం చరిత్రలోనే తొలిసారిగా ఈ నెంబర్ నెంబర్‌ రూ.8.5లక్షలు పలకడం అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది.

కొడాలి శ్రీకాంత్‌, గ్రీన్‌స్టోన్‌ ఇన్‌స్ర్టెక్చర్‌ కంపెనీ రూ.1,06,525, అక్బర్‌ రూపాణి రూ.1,81,100,సంజయ్‌సింగ్‌ ఠాకూర్‌ రూ.2,30,000కు పోటీ పడగా కొడాలి శ్రీకాంత్ అనే వ్యక్తి రూ.8.5లక్షలకు ఈ నెంబర్‌ను దక్కించున్నారని ఆర్టీఏ సీపీ వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. టీఎస్‌ 13ఈపీ 9999 నెంబర్‌ను కొడాలి శ్రీకాంత్‌ 8లక్షల 50వేలకు డ్రా సిస్టమ్‌ ద్వారా తన సొంతం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇదే నెంబర్ ని 2019లో యూనీయాడ్స్‌ 4లక్షల 65 వేలకు సొంతం చేసుకుందని, ఈ నెంబర్ కి విశేష ఆదరణ ఉంటుందని వివరించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా పలువురు సిని నటులు సైతం దీని కోసం ఎక్కువగా పోటీ పడుతూ ఉంటారు. సిని ప్రముఖుల ఖరీదు అయిన వాహనాలకు అదే స్థాయిలో నెంబర్ కూడా ఉండే విధంగా చూస్తారు. ఇది కొంత మందికి సెంటిమెంట్ కూడా.

Read more RELATED
Recommended to you

Latest news