ఏపీలో దారుణం.. మగబిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక !

-

మన దేశంలో మహిళలపై ఆఘాయిత్యాలు ఏ మాత్రం తగ్గడం లేదు. దేశంలోని ఏదో ఓ మూలన… మహిళలపై లైంగిక దాడులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కఠినమైన చట్టాలు తెచ్చినా…. మహిళలపై దాడులు ఏ మాత్రం ఆగడం లేదు. అయితే.. తాజాగా విశాఖ పట్టణంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది.

ఓ కామాంధుడు కారణంగా… మగ బిడ్డకి జన్మనిచ్చింది ఓ మైనర్. 9 వ తరగతి చదువుతున్న ఓ మైనర్ ఏకంగా మగబిడ్డకు జన్మనివ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. కేజీహెచ్ గైనిక్ వార్డులో అడ్మిట్ అయిన మైనర్… ఈరోజు మగ బిడ్డ కి జన్మనిచ్చింది. అయితే.. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… నిందితుడి కోసం గాలిస్తున్నారు. దీనికి కారణం మర్రిపలెం మండలానికి చెందిన యువకుడు చరణ్ గా అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం పరారీ లో ఉన్నాడు అనుమానితుడు చరణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version