సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రేమ కథలను చూస్తూ ఉంటాం. అయితే వాటిలో కొన్ని సక్సెస్ అయిన స్టోరీలు ఉంటే, మరికొన్ని ఫెయిల్యూర్ స్టోరీలు ఉన్నాయి. కొన్ని జంటలు ప్రేమించిమ సక్సెస్ ఫుల్ గా వివాహం చేసుకుంటే మరికొంతమంది ప్రేమించిన వారి కోసం ఏండ్లుగామఎదురుచూస్తుంటారు. అలాగే కొన్ని ప్రేమ కథలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని ప్రేమ కథలనుమ వింటే చాలు అందరూ ఆశ్చర్యపోతుంటారు. అంటాంటి ఒక లవ్ స్టోరీ నే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ ప్రేమ జంట జీవితంలో చివరి దశలో పెళ్లి చేసుకుని వారి ప్రేమను కాపాడుకుని ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి కావడం విశేషం. 100 ఏళ్ల బెర్నీ లిట్మాన్ తన చివరి రోజుల్లో 102 ఏళ్ల మార్టోరీ ఫుటర్ మాన్ ను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహాన్ని గుర్తించి తాజాగా రికార్డు అందజేసింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్.