నీచమైన పనికి తెగబడిన తల్లి.. కన్న కూతురిపై ప్రియుడితో

-

మహారాష్ట్రలో ఘోరం జరిగింది. కన్న తల్లి అనే పేరుకే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది ఓ మహిళ. కన్న కూతురు ప్రియుడితో కలిసి ఘోరానికి పాల్పడింది. 17ఏండ్ల కూతురు‌పై ప్రియుడు అత్యాచారానికి పాల్పడుతుంటే ఆపాల్సిందిపోయి, సహకరించి సభ్యసమజం తలదించుకొనేలా ప్రవర్తించింది. తల్లి చెర నుంచి తప్పించుకుని బయట పడిన ఆ మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను ఔరంగాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

బాధితురాలి వివరాల ప్రకారం తల్లిదండ్రుల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో వేర్వేరుగా జీవిస్తున్నారు. తల్లితోపాటు కూతురు, కొడుకు ఉంటున్నారు. అప్పటికే ఓ వ్యక్తితో ఆ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్నది. తరుచూ ఇంటికి వచ్చే అతను ఆమె కూతురుపై కన్నేశాడు. గత ఏడాది ఆగస్టులో ఇంటికి వచ్చి తన కుటిల పన్నాగాన్ని తల్లికి వివరించాడు. అతడికి సహకరించడం కోసం కొడుకును బంధువుల ఇంటికి పంపించి వేసింది. అదే అదునుగా ఆ బాలికతో తల్లి ప్రియుడు అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ప్రియుడిని అడ్డుకోవాల్సిన తల్లి అతను చెప్పినట్లు నడుచుకోవాలని కూతురును హెచ్చరించింది. ఈ సంఘటన అనంతరం ఆ బాలికపై అతను రెండుసార్లు అత్యాచారం జరిపాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆ బాలికను బెదిరించాడు.

ఘోరం జరిగిన తర్వాత ఇంటి నుంచి పారిపోయిన బాలికకు ఎక్కడా ఆశ్రయం దొరకలేదు. గత్యంతరం లేక తిరిగి ఇంటికి చేరుకున్నది. దీంతో తల్లి మరో కుట్రకు తెర తీసింది. ఆ బాలికు ఓ యువకుడికి ఇచ్చి పెండ్లి చేయడానికి ప్రయత్నించింది. పెండ్లి ముసుగులో ప్రియుడితో ఆఘాయిత్యానికి పాల్పడాలనే ఆలోచనను పసిగట్టిన ఆ బాలిక చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయడంతో వారు ఆమెను రక్షించారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version