ఇంజినీరింగ్ చేయాలనుకునే వారికి భారీ షాక్.. ఫీజులు భారీగా పెరిగే చాన్స్

-

రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్ అయిపోయాక చాలామంది బీటెక్ వైపు మొగ్గుచూపడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రతి ఏటా ఇంజినీరింగ్ చదవాలనుకునే విద్యార్థులు పెరుగుతున్నారు. తద్వారా వచ్చే ఏడాది ఇంజినీరింగ్ కోర్సుల్లో ఫీజులు 20 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

పలు కాలేజీల్లో ఫీజులు ఇప్పటికే రూ.2 లక్షలు వరకు ఉన్నాయి. వచ్చే మూడేండ్లకు ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను నిర్ణయించేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది.చివరిసారిగా 2022లో ఫీజుల పెంపును నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరంలో గడువు ముగియనుంది. దీంతో 2025-2026 విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి.అందుకే రాష్ట్రంలోని 163 ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలతో తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ భేటీ అయినట్లు తెలిసింది. ఈసారి 2.2 నుంచి 2.5లక్షల వరకు ఫీజులు పెరిగే చాన్స్ ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news