కియా కార్ ఇంజిన్ల చోరీలో కీలక మలుపు.. ఆరుగురి అరెస్టు

-

ఏపీలో రెండు నెలల కిందట కియా కార్ల తయారీ కంపెనీలో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. సుమారు 940 ఇంజిన్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ. కోట్లలో ఉంటుంది. అయితే, ప్లాంట్ మేనేజర్ ఫిర్యాదులో ఆలస్యం చేయడంతో ఇన్ని రోజులు నిందితులను పట్టుకోవడంలో ఆలస్యం అయ్యిందని సమాచారం.

కాగా, ఎట్టకేలకు పోలీసులు నిందితులను పట్టుకున్నారు. కియా కార్ ఇంజిన్ల చోరీకి పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మొత్తం 8 మందిలో ఆరుగురుని కస్టడీకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను తీసుకుని ఢిల్లీ, తమిళనాడుకు వెళ్లారు. చోరీకి గురైన 940 ఇంజిన్లలో 288 కారు ఇంజిన్లను ఢిల్లీలో విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మిగతా ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. అలాగే దోచిన ఇంజిన్లను రికవరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news