ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు.. కానీ ఈ పదం ప్రేమకంటే.. అత్యాచారానికి బాగా సెట్ అవుతుందేమో.. నిజానికి అత్యాచారం చేయడానికి వయసుతో సంబంధం లేకండా అయిపోయింది. స్కూల్ పిల్లల నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకూ ఎవర్నీ వదలటం లేదు. చట్టాలు తెచ్చినా ఎవడూ భయపడటం లేదు. నేరం చేసినా రుజువు కావడానికే కొన్ని ఏళ్లు పడుతుంది.. ఇంక ఎవరూ మాత్రం వెనకడుగేస్తారు.. ఆఖరికి దివ్యాంగులను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లో 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..
మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలోని తన బంధువులను పరామర్శించేందుకు 90 ఏళ్ల వృద్ధురాలు గురువారం రాత్రి బయలుదేరింది.. జబల్‌పూర్ నుంచి షాదోల్ రైల్వే స్టేషన్‌కు వచ్చేసరికి రాత్రి అయిపోయి చీకటి పడటంతో ఆమె రాత్రిపూట రైల్వే స్టేషన్‌లో ఉండిపోయింది. ఒక ఆటోరిక్షా డ్రైవర్ ఆమెను శుక్రవారం ఉదయం అంట్రా గ్రామంలోని ప్రధాన రహదారి వరకు తీసుకువెళ్లాడు. ప్రధాన రహదారికి కొంత దూరంలో ఉన్న ఆమె బంధువుల ప్రదేశానికి వెళ్లడానికి మరొక వాహనాన్ని చూసుకోమని ఆమెను అక్కడ దించి వెళ్లాడు.
దీంతో ఆ వృద్ధురాలు బస్సు కోసం ఎదురుచూస్తుండగా బైక్‌పై అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు. మిమ్మల్ని నేను దించుతా రండి అంటూ నమ్మబలికి బండి ఎక్కించుకున్నాడు. అయితే అసలు రూట్‌లో వెళ్లకుండా పక్కదారి పట్టి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతను ఆమెను ప్రధాన రహదారిపై వదిలి పారిపోయాడు..ఆమె తన బంధువులకు ఈ ఘటనను వివరించిన తర్వాత, వారు పోలీసులను ఆశ్రయించారు.. తెలిపారు. గుర్తుతెలియని మోటార్ సైకిలిస్ట్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ప్రతీక్ చెప్పారు. బాధిత వృద్ధురాలు ఆసుపత్రిలో చేరిందని, నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎస్పీ వెల్లడించారు.