బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఫార్ములా- ఈ కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. దీంతో ఏసీబీ, ఈడీలకు మాజీ మంత్రిని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చినట్టు అయింది. ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకుంది హైకోర్టు.
జస్టీస్ లక్ష్మణ్ బెంచ్ తాజాగా తుది తీర్పును వెలువరించింది. మరోవైపు నిన్న ఏసీబీ విచారణకు లీగల్ టీమ్ తో వెళ్లారు కేటీఆర్. అయితే లీగల్ టీమ్ ను అనుమతించకపోవడంతో ఏసీబీ విచారణకు హాజరు కాలేదు కేటీఆర్. విచారణ అంశాన్ని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెల్లింది. ఫార్ములా ఈ రేసు కేసును ఏసీబీ, ఈడీ రెండు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. విచారణకు రావాలని ఇప్పటికే ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది.