ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణీ : హరీశ్ రావు

-

ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణీ వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ కోసం రెండు రోజులు ప్రభుత్వం ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజల నుంచి సొమ్మును దండుకునే కార్యక్రమానికి తెర లేపడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ పేరిట 15వేల కోట్లు ప్రజల ముక్కు పిండి వసూలు చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

ఎల్ఆర్ఎస్ పై అడ్డగోలుగా విమర్శలు చేసిన కాంగ్రెస్ నేడు అధికారంలోకి రాగానే అసలు రంగు బయటపెట్టుకుందని హరీశ్ రావు విమర్శించారు. డబ్బులు లేక ప్రజల ఇబ్బందులు పడుతుంటే ఎల్ఆర్ఎస్ పేరిట డబ్బులు దండుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అయిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం.. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version