తెలంగాణాలోని మహా శైవక్షేత్రాలలో ఒక్కటైన పుణ్యక్షేత్రం కాళేశ్వరం. దక్షిణ కాశీగా పేరుగాంచిన
ఈ క్షేత్రంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉంటాయి.
కాలుడు, శివుడు ఇద్దరూ లింగ రూపంలో ఒకే పానవట్టంపై దర్శనమిస్తారు. ముందుగా యముడిని
దర్శించి తదుపరి ముక్తేశ్వరుడిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని నమ్మకం.
గర్భగుడికి నాలుగుదిక్కులా నాలుగు నంది విగ్రహాలు, నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు గోపురాలు
ఉండటం కాళేశ్వర క్షేత్రం ప్రత్యేకత. కోణార్క, అరసవెల్లి, కాళేశ్వరంలలో మాత్రమే సూర్యదేవాలయాలు ఉన్నాయి. గోదావరి, ప్రాణహిత నదుల పరివాహక ప్రాంతంలోని తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల భక్తుల పూజలతో కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం విరాజిల్లుతుంది. ఈ ఆలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఉంది. కాలేశ్వరంలోని శ్రీకాలేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయ పాలక మండలి నియామకానికి దేవాదాయ శాఖ రీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర దేవాలయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసారు. నేటి నుంచి 20 రోజుల పాటు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.