మేక‌ను పెళ్లి చేసుకున్న యువ‌కుడు.. వీడియో వైరల్

-

పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. వివాహం జరిపే ముందు.. వధూ, వరుల జాతకాలు, తిదిలు కచ్చితంగా చూసే..పెళ్లి ముహుర్తం పెడతారు. కొంత మంది పెళ్లి ముందు వింత ఆచారాలను కూడా పాటిస్తారు. అయితే.. తాజాగా తన దోష నివారణ కోసం అంటూ ఓ మేరకు పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. జాతకం పట్ల ఆ యువకుడికి ఉన్న నమ్మకమే ఇందుకు కారణం.

కృష్టా జిల్లా నూజివీడు పట్టణంలోని అన్నవరం రోడ్‌ లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. తనకు రెండు పెళ్లి ళ్లు జరుగుతాయని ఉండటంతో.. దోష నివారణ జరిపించాలని ఆ యువకుడు అనుకున్నాడు. ఉగాది సందర్భంగా నిన్న స్థానికంగా ఉండే నవ గ్రహ ఆలయంలో.. అర్చకులు ఆ యువకుడికి మేక తో మొదటి వివాహం జరిపించారు. మన హిందూ ధర్మంలో.. దోష నివారణ కోసం ఇలా చేయొచ్చని ఉందని వారు చెప్పారు. ప్రస్తుతతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version