Breaking : దుబ్బాకలో అదుపుత‌ప్పి బావిలో ప‌డిన కారు

-

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ లో… ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగం తో ఉన్న ఓ కారు అదుపుతప్పి చిట్టాపూర్ వద్ద ఓ బావిలో పడిపోయింది. అయితే అయితే కారు బావిలో పడి పోవడం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు… సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ఘటన స్థలానికి చేరుకున్నారు.

పోలీసులతో పాటు రెస్క్యూ టీం కూడా ఆ బావి దగ్గరికి చేరుకుంది. అయితే… బావిలో పడ్డ కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే దానిపై ఇంకా తెలియరాలేదు. దుబ్బాక నుంచి వస్తున్న సమయంలోనే ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు అతి వేగంగా దూసుకు వచ్చి.. అదుపుతప్పి బావిలో పడి ఉందని స్థానికులు చెబుతున్నారు.

ఇక అక్కడికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీం అధికారులు… కారును బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేసి.. కారు లో ఉన్న వారిని బయటకు తీయాలని… అధికారులను ఆదేశించారు రఘునందన్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version