గర్భం దాల్చిన పదోతరగతి విద్యార్థిని.. నొప్పులు భరించలేక మృతి

-

ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో పదో తరగతి విద్యార్థిని గర్భం దాల్చింది. నెలలు నిండి ప్రసవ సమయంలో నొప్పులు భరించలేక ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఆమెకు గర్భం చేసింది ఎవరో కూడా తెలియదు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

బాధిత బాలిక(16) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.ఆమె తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తుంటారు. ఏం జరిగిందో తెలీదు.. ఏ కామాంధుడి కన్ను పడిందో తెలియదు. కొన్ని నెలల కిందట బాలిక గర్భం దాల్చింది.విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను పాఠశాలకు పంపలేదు. ఇంటికే పరిమితం చేశారు. శనివారం రాత్రి బాలికకు పురిటి నొప్పులు రావడంతో ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆదివారం ఆడబిడ్డ జన్మించింది.దీంతో తల్లికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో తల్లిబిడ్డలను అంబులెన్సు‌లో తిరుపతికి తరలించారు. కాగా, అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Read more RELATED
Recommended to you

Latest news