కర్నూలులో దారుణం..లవర్ కోసం స్నేహితుడి హత్య

-

కర్నూలులో దారుణం చోటు చేసుకుంది. లవర్ కోసం స్నేహితుడి హత్యకు తెగాయించారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, జనవరిలో హత్యకు గురయ్యాడు కర్నూలు ఎర్రబురుజు కాలనీకి చెందిన మురళీ కృష్ణ. మురళీ కృష్ణ ను అతని స్నేహితులు దినేష్ కుమార్, కిరణ్ కుమార్ హత్య చేశారు. దినేష్ కుమార్ ప్రియురాలు నగ్న వీడియోలను ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని, బ్లాక్ మెయిల్ చేశాడు మురళీకృష్ణ.


మురళీకృష్ణ వేధింపులు భరించలేక సూసైడ్ ఆటెంప్ట్ చేసింది యువతి. ఇక ప్రియురాలిని వేధించాడని కక్ష పెంచుకున్న దినేష్… జనవరి 25న పంచలింగాల దగ్గరకు తీసుకువెళ్లి గుండెలో కత్తితో పొడిచి మురళీ కృష్ణను చంపేశారు దినేష్ కుమార్ అతని స్నేహితుడు కిరణ్ కుమార్. మృతదేహాన్ని నగర శివారులోని హంద్రీనీవా కాలువలో పడేశారు దినేష్ కుమార్, కిరణ్ కుమార్. తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు మురళీకృష్ణ తల్లి దండ్రులు. ఇక పోలీసుల దర్యాప్తుతో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. మురళీకృష్ణ మృతదేహం కోసం హంద్రీనీవా కాలువ లో 10 కి.మీ మేర గాలించారు పోలీసులు. మురళీకృష్ణ మృతదేహం ఇంకా దొరకలేదు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version