ఏపీలో దారుణం..మూగ మహిళను బంధించి, 42 రోజుల పాటు లైంగిక దాడి !

-

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మూగ మహిళను బంధించి…42 రోజుల పాటు లైంగిక దాడి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఈ సంఘటన మచిలీపట్నం పెద్ద వులoగ పాలెంల జరుగగా…..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. రోజువారీ కార్మికురాలైన మోకా జయలక్ష్మి (37).. వంట పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఫిబ్రవరి 4వ తేదీన వంట పని ఉంది… డబ్బులిస్తామని ఆమెకు మాయమాటలు చెప్పారు.

మభ్యపెట్టి ఆ అమ్మాయిని మచిలీపట్నం నుండి రహస్యంగా కుటుంబ సభ్యులకు తెలియకుండా దుండగులు కరీంనగర్ తరలించారు. పగలు రాత్రి తేడా తెలియకుండా ఒక చీకటి గదిలో బంధించి తిండి పెట్టకుండా అనేక బాధలు పెట్టారు. అంతేకాదు.. కిడ్నాప్‌ చేసిన ఆ వ్యక్తులు రేప్‌ కు పాల్పడ్డారు. జయ లక్ష్మీ ఎక్కడా కనిపించకపోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ కేసును ఛేదించి… నిందితులను అరెస్టు చేశారు. దీనిపై కోర్టు త్వరలోనే తీర్పు కూడా చెప్పనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version