అల్లు అర్జున్ ను చూడగానే ఎమోషనల్ అయిన అభిమాని….. నెట్టింటా వీడియో వైరల్

-

మెగా ఫ్యామిలీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా ఓ అభిమాని అతడిని కలవడానికి వచ్చి ఎమోషనల్ అయ్యారు. అల్లు అర్జున్ ను చూడగానే ఆనందంతో నోట మాటలు రాక కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో అభిమాని భుజంపై చేయి వేసి ఓదార్చారు. అతనితో ప్రేమగా మాట్లాడారు. ఈ వీడియోను అభిమానులు నెట్టింట్లా వైరల్ చేస్తూ.. బన్నీ మనసు బంగారమని కామెంట్స్ పెడుతున్నారు.

కాగా, సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version