‘దేవర’ నుంచి ఫియర్ సాంగ్ వచ్చేసింది

-

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ‘దూకే ధైర్యమా.. జాగ్రత్త. దేవర ముంగిట నువ్వెంత’ అంటూ సాగే ఫియర్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. దేవరలోని ఈ తొలి సాంగ్ లిరికల్ వీడియోలో ఎన్టీఆర్ స్టెప్స్ అదిరిపోయాయి. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజ్ చేశారు.

కాగా, ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా న‌టిస్తుంది విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌ల‌ను రిలీజ్ చేయ‌గా….. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.తారక్ ఈ మూవీ లో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version