అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఇక పండగే పండగ..?

-

కరోనా వైరస్ సంక్షోభం సమయంలో థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఓటిటి ప్లాట్ఫామ్ కి ఎక్కువగా డిమాండ్ పెరిగి పోయిన విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటివరకు పలు స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఇక ప్రస్తుతం సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు తీపి కబురు అందించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య సమయంలో ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదల చేసేందుకు సిద్ధమైంది అమెజాన్ ప్రైమ్. ఇందులో సూర్య హీరోగా నటిస్తున్న ఆకాశం నీ హద్దురా తో పాటు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా కూడా ఉంది .

అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలు కూలి నెంబర్ 1, దుర్గావతి, ఛాలంగ్ సినిమాలు.. మాధవన్ హీరోగా తెరకెక్కిన మారా.. కన్నడ చిత్రం భీమసేన నల మహారాజా, మలయాళ చిత్రం హాలాల్ లవ్ స్టోరీ సహా మరికొన్ని సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక ఈ పండుగ సీజన్లో అమెజాన్ ప్రైమ్ వినియోగదారులందరికీ వరుస సినిమాల విడుదలతో పండగే పండుగ అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version