రంగారెడ్డి జిల్లాలోని టాటా నగర్‌లో గల ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. మంటలు ఇప్పట్లో కంట్రోల్‌లోకి వచ్చేలా లేవని స్థానికులు చెబుతున్నారు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలికి చేరుకుని ఎగిసి పడుతున్న అగ్నికీలలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
షాక్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చాక విచారణ చేపట్టి అసలు విషయం వెల్లడిస్తామన్నారు. ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం వలన రూ.లక్షల్లో నష్టపరిహారం సంభవించినట్లు తెలుస్తోంది. ఆ మంటలు పక్కన ఉండే దుకాణా,ఇళ్ల సముదాయాలకు వ్యాపించకుండా పోలీసులు తగిన చర్యలు చేపడుతున్నారు.