గణేష్ చతుర్థి మరో రెండు రోజుల్లో ఉన్న నేపథ్యంలో పెను ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే గణేష్ విగ్రహాన్ని తీసుకువెళ్లే నేపథ్యంలో హైదరాబాదులో గత వారం రోజుల్లో 10 మంది మరణించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంఘటనలు జరుగుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో మరో పెను ప్రమాదం హైదరాబాదులో జరిగింది. మండపానికి తరలిస్తున్న ఓ భారీ గణనాథుడు నేలకొరిగాడు. ఈ ఘటన ఉప్పల్ పరిధిలో ఉన్న రామంతపూర్ లో జరిగింది. ఈ సమాచారం అందుకొని… వెంటనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు.