మానవుని ఆహారంలో గుడ్డు చాలా సంవత్సరముల నుంచి అంతర్భాగంగా ఉంది. అంతేకాక ఇది సంపూర్ణ పోషకాలను అందిస్తుంది. మానవుని ఆహారంలో దీనిని పోషకాల గనిగా భావిస్తే, మరికొందరు కొలెస్ట్రాల్ భయంతో దూరం పెడతారు. నిజంగా గుడ్డు పచ్చసొన ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేక హాని కలిగిస్తుందా? పచ్చ సోన పోషకాల విలువ, ప్రయోజనాలు, నష్టాలను వివరంగా తెలుసుకుందాం..
పోషకాల విలువ: గుడ్డు పచ్చ సొనలో విటమిన్లు A,D,E,B12 అధికంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యం ఎముకల బలం, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కొలిన్ అనే పోషకం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఒక పచ్చ సోనా లో సుమారు 5 గ్రాముల కొవ్వు రెండు గ్రాముల ప్రోటీన్ ఉంటాయి.
ఆరోగ్య ప్రయోజనాలు: పచ్చ సొనలోని యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలపై మాక్యులర్ డిజైనర్ నివారిస్తాయి. కొలీన్ గర్భిణీ స్త్రీలలో శిశువు మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. గుడ్డు పచ్చి సొన తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాలు స్థాయి పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం సురక్షితం అని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

పచ్చ సొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఒక గుడ్డు లో 180 గ్రాములు, ఉంటుంది. గతంలో ఇది గుండెజబ్బుల కారణమని కొందరు భావించారు కానీ ఇటీవల పరిశోధనలు ఆహార కొలెస్ట్రాల్ శరీరంలో చెడు కొలెస్ట్రాలపై తక్కువ ప్రభావం చూపుతుందని తేల్చాయి. అయినప్పటికీ డయాబెటిస్ ఉన్నవారు లేదా గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా పై గుడ్డును తీసుకోవాలి.
గుడ్డు పచ్చ సొన ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చు కానీ మితంగా తీసుకోవడం ముఖ్యం రోజుకు 1 లేదా రెండు గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్య పరిస్థితులను బట్టి వైద్య సలహా తీసుకోవడం మంచిది.