రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి రా అని సవాల్ విసిరారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఇనుప కంచెలు వేసుకొని భయపడుకుంట ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు పోయిండు అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వస్తున్నాడని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అరెస్టు చేశారని ఆగ్రహించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రేవంత్ రెడ్డిని ఉరికిస్తే.. సందుల్లల్ల పడి ఉరికిండు అని చురకలు అంటించారు. జేబులో కత్తెర పెట్టుకొని బీఆర్ఎస్ కట్టినవాటికి రిబ్బన్ కట్ చేసుడు తప్ప నవ్వు చేసింది ఏంది? అని నిలదీశారు హరీష్ రావు.