భార్యను పుట్టింటికి పంపిన భ‌ర్త‌.. ఆ త‌ర్వాత ఏం చేశాడో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!

-

ఓ వ్య‌క్తి త‌న భార్య‌ను పుట్టింటికి పంపించాడు. ఇక్క‌డివ‌రు బాగానే ఉంది. కాని ఆ త‌ర్వాత స‌ద‌రు వ్య‌క్తి చేసిన‌ ప‌నికి అంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కూకట్‌పల్లి షంషీగూడలో ఉండే సతీశ్ (35), సంధ్యారాణి భార్యాభర్తలు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నాడు. సతీశ్ ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తుండగా, సంధ్యారాణి గృహిణి. సంక్రాంతి సందర్భంగా తాను తర్వాత వస్తానంటూ ఈ నెల 11న భార్య సంధ్యారాణి, పిల్లలను మిర్యాలగూడలోని ఆమె పుట్టింటికి పంపించాడు.

ఆ తర్వాత వస్తానన్న భర్త రాకపోవడంతో ఈ నెల 13న సతీశ్‌కు భార్య ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో అనుమానం వచ్చిన ఆమె నిన్న షంషీగూడ వచ్చింది. అక్కడ తమ ఇంటిని భర్త ఖాళీ చేసినట్టు ఇరుగుపొరుగువారు చెప్పడంతో సంధ్యారాణి షాకైంది. దీంతో ఆమెకు ఇంటిని ఖాళీ చేసి అదృశ్యం అయ్యాడ‌ని అర్థం చేసుకుని షాక్ అయింది. ఆ వెంట‌నే కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version