తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు…దాదాపు 30 నిమిషాలు సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును…సత్కరించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ రోజు నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు గారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేటీఆర్ గారికి వెంకటేశ్వర స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు టీటీడీ చైర్మన్. ఈ సందర్భంగా కేటీఆర్ గారు ఛైర్మన్ గారికి శాలువా కప్పి.. వెంకటేశ్వర స్వామి జ్ఞాపకను అందజేసారు.